Godavarikhani: నేత్రదాత ఇల్లందుల రాజయ్య గౌడ్‌కు ఘన నివాళి

Godavarikhani: గోదావరిఖని అల్లూరులో నేత్రదాత ఇల్లందుల రాజయ్య గౌడ్ సంస్మరణ సభ నిర్వహించిన సదాశయ ఫౌండేషన్; కుటుంబ సభ్యులకు అభినందన పత్రం అందజేత.

VIJAY, RAMAGUNDAM
Published on: 22 Nov 2026 10:17 PM IST
Godavarikhani
X

Godavarikhani: నేత్రదాత ఇల్లందుల రాజయ్య గౌడ్‌కు ఘన నివాళి

గోదావరిఖని: నేత్రదానం చేసిన ఇల్లందుల రాజయ్య గౌడ్ సేవలను స్మరిస్తూ ఆదివారం ఆయన నివాసంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదాత సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మౌనం పాటించారు. గోదావరిఖని యైటింక్లైయిన్ కాలనీ సమీపంలోని అల్లూరుకు చెందిన ఇల్లందుల రాజయ్య గౌడ్ ఈ నెల 13న అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

పుట్టెడు దుఃఖంలోనూ ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చి, నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్‌కు అందజేశారు. సంస్మరణ సభలో సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు, లీగల్ అడ్వైజర్ నూతి సురేష్ కుమార్ మాట్లాడుతూ... కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలోనూ మరో ఇద్దరికి చూపునిచ్చేలా నేత్రదానం చేయడం గొప్ప మానవీయ నిర్ణయమన్నారు.

నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, మరణానంతరం నేత్రదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం నేత్రదాత కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ తరఫున అభినందన పత్రం అందజేశారు. కార్యక్రమంలో నేత్రదాత భార్య రాజేశ్వరి, కుమారులు రాజేష్, సురేష్, కోడళ్లు అనూష, మమత, గౌడ సంఘం పెద్ద సట్ల పరుశురాం గౌడ్, ముక్కెర లక్ష్మీనారాయణ, గుండ గంగయ్య, ఎల్లయ్య, పొన్నం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM