Namsampalli: నాంసాంపల్లిలో మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు!

Namsampalli: పెద్దపల్లి జిల్లా నాంసాంపల్లిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి దేవి అవతారంలో దర్శనమిచ్చారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 17 Oct 2026 7:30 AM IST
Namsampalli
X

Namsampalli: నాంసాంపల్లిలో మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు!

Namsampalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని నాంసాంపల్లి గ్రామంలో నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు రెండు లక్షల 116 రూపాయలతో అమ్మవారిని అత్యంత రమణీయంగా, శోభాయమానంగా అలంకరించారు. అనంతరం నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గ్రామానికి చెందిన భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli