Karimnagar: దొరికిన సెల్‌ఫోన్‌ను బాధితుడికి అందించిన సమ్మన్న ముదిరాజ్!
Karimnagar: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన గోనెల సమ్మన్న ముదిరాజ్.. తనకు దొరికిన సెల్‌ఫోన్‌ను బాధితుడికి సురక్షితంగా అందించి తన నిజాయితీని చాటుకున్నారు.
Karimnagar: దొరికిన సెల్‌ఫోన్‌ను బాధితుడికి అందించిన సమ్మన్న ముదిరాజ్!
Karimnagar: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన గోనెల సమ్మన్న ముదిరాజ్ నిన్న అనగా తేదీ 31-7-2026 రోజున పెద్దపెల్లి జిల్లా గురాంపల్లి కి తన మిత్రుడు విద్యుత్ ఉద్యోగి పాలితపు గట్టయ్య అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో రాత్రి 8:30 గంటలకు కాల్వ శ్రీరాంపూర్ మండలం గూడెం బస్టాండ్ దగ్గర ఒక సెల్ ఫోన్ దొరికింది.
ఇట్టి విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా తెలుసుకున్న బాధితుడు హుజురాబాద్ నుండి పెద్దపల్లి వెళుతున్న తరుణంలో సెల్ ఫోన్ మార్గమద్యంలో పడిపోయిందని సమ్మన్నకు ఫోన్ చేయగా ఇంటికి రమ్మని తెలిపినాడు.
ఈరోజు తేది:01-8-2026 ఉదయం 11:00 గంటలకు బాధితుడు విల్సన్ మల్లారెడ్డిపల్లికి వచ్చి తన వివరాలు తెలుపగా గ్రామస్తుల ఆధ్వర్యంలో గోనెల సమ్మన్న ముదిరాజ్ సెల్ఫోన్ అందించి మానవత్వం చాటుకున్నారు.
ఈ సంధర్బంగా గ్రామస్తులు సమ్మన్నను అభినందించారు.
బాదితుడు విల్సన్ ధన్యవాదాలు తెలిపినాడు.ఈకార్యక్రమంలో గోనెల సమ్మన్న ముదిరాజ్,గుమ్మడి సంపత్, రాయణవేణి చంద్రయ్య, బాదితుడు విల్సన్, గ్రామస్తులు ముద్దసాని శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.




