Sultanabad: ఆరుతడి పంటలపై రైతులకు ప్రభుత్వ విప్ కీలక సూచనలు!
Sultanabad: సుల్తానాబాద్‌లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు రూ. 20 లక్షల బస్తీ దవాఖాన పనులకు శంకుస్థాపన చేసి, ఎల్ నినో పంటలపై రైతులకు సూచనలు చేశారు.
Sultanabad: ఆరుతడి పంటలపై రైతులకు ప్రభుత్వ విప్ కీలక సూచనలు!
సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డులో 20 లక్షల రూపాయలతో సోమవారం రోజున నూతన బస్తీ దవాఖాన నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు, ముందుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు స్థానిక వార్డు కౌన్సిలర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ, ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పల్లె దవఖానలు, బస్తీ దవాఖానలకు ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన చికిత్సలు అందిస్తూ ముందుకు పోతున్నారని అందులో భాగంగానే ఏడవ వార్డులో 20 లక్షల రూపాయలతో బస్తీ దవాఖాన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.దవాఖాన కు కావలసిన బోర్వెల్, ప్రహరీ నిర్మాణం తోపాటు ఇతర సౌకర్యాలను కల్పించేందుకు మరో ఐదు లక్షల రూపాయలు మంజూరు కి కృషి చేస్తానని అన్నారు. అలాగే మున్సిపల్ పరిధిలో సుగ్లంపల్లి, పూసాల, సుల్తానాబాద్ లలో మహిళా భవనాలకు నిధులు మంజూరు చేస్తానని అన్నారు.
సుల్తానాబాద్ పట్టణంలోని మహిళలందరికీ 10 గుంటల స్థలం కేటాయించి భవన నిర్మాణానికి నిధులు అందిస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా కొరతను సృష్టిస్తుందని గతంలో ప్రధానిగా ఉన్న నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు ఎలాంటి కొరత లేకుండా యూరియాను అందించారని వివరించారు. ప్రస్తుతం ఎల్ - నోవా ప్రభావం ఉందని రైతులందరూ వరికి బదులుగా ఆరుతరి పంటలు వేసుకోవాలని ప్రస్తుతం నీటిమట్టం ఉన్న మరో రెండు నెలల్లో భూగర్భ జలాలు అడుగంటుతాయని రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. యూరియాకు బదులుగా సేంద్రియ ఎరువులను వాడి దిగుబడులను పెంచుకునే విధంగా రైతులు కృషి చేయాలన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత మరియు స్థానిక కౌన్సిలర్ ఊట్ల వరప్రదీప్ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు వైద్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పలువురు పాల్గొన్నారు.




