Peddapalli: వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన విప్ విజయ రమణ రావు!
Peddapalli: పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్, తుర్కల మద్దికుంట గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణ రావు ప్రారంభించారు.
Peddapalli: వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన విప్ విజయ రమణ రావు!
Peddapalli: పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ మరియు తుర్కల మద్దికుంట గ్రామాల్లో సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే విజయ రమణ రావు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేట్లు తగ్గించి రైతులను నష్టపరిచే దళారుల ప్రయత్నాలను తిప్పికೊట్టడానికే వీలైనంత త్వరగా ఈ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 2,462/- మద్దతు ధర ఇస్తోందని తెలిపారు. అంతేకాకుండా, ధాన్యం అమ్ముకున్న 24 నుండి 48 గంటల్లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని, దీనికి అదనంగా క్వింటాలుకు రూ. 500/- బోనస్ కూడా అందుతుందని వెల్లడించారు.
రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సింగిల్ విండో మరియు ఐకేపీ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధరను పొందాలని కోరారు. రాబోయే పది రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో PSS చైర్మన్ ముత్యాల నరేష్ ముదిరాజ్ స్థానిక సింగిల్ విండో చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




