Sircilla: సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్ల పరిశీలన: ప్రభుత్వ విప్
Sircilla: సెప్టెంబర్ 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ పరిశీలించారు.
Sircilla: సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్ల పరిశీలన: ప్రభుత్వ విప్
సిరిసిల్ల: సెప్టెంబర్ 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సభా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతేతో కలిసి సభ నిర్వహించే ప్రదేశంతో పాటు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరయ్యే క్రమంలో పట్టణంలోకి ప్రవేశించే మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అంబేద్కర్ చౌరస్తా, చంద్రంపేట చౌరస్తా ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్ రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. భారీ సంఖ్యలో ప్రజలు సభకు హాజరయ్యే అవకాశం ఉన్నందున పార్కింగ్, ట్రాఫిక్, భద్రతతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.




