Odela: కాంగ్రెస్‌లోకి జీలకుంట సర్పంచ్ మహిళా భవనాన్ని ప్రారంభించిన విప్

Odela: జీలకుంటలో రూ.15.28 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరారు.

KONDAL, SULTANABAD
Published on: 26 Jun 2026 7:28 PM IST
Odela
X

Odela: కాంగ్రెస్‌లోకి జీలకుంట సర్పంచ్ మహిళా భవనాన్ని ప్రారంభించిన విప్

ఓదెల: జీలకుంట గ్రామంలో రూ. 15.28 లక్షల డీఎంఎఫ్‌టీ (DMFT) నిధులతో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని శుక్రవారం రోజున ప్రారంభించిన తదుపరి జీలకుంట గ్రామ బీజేపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు వార్డు సభ్యులు బంగారి పద్మా శ్రీనివాస్ గార్లు మరియు వారి అనుచరులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు..

తదుపరి ఓదెల మండల కేంద్రంలోని KGBV విద్యాలయంలో 20 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు డార్మిటరీ మరియు టాయిలెట్స్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు గారు..

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ..

గ్రామాభివృద్ధికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ​ఆనాడు మహిళా సంఘం భవన నిర్మాణానికి 2.5 గుంటల స్థలాన్ని దానం చేసిన దివంగత మల్లారెడ్డి గారి త్యాగాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు గారు కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా ఈ మహిళా భవనానికి 'భూదాత మల్లారెడ్డి' పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. మహిళల సౌకర్యార్థం ఈ భవనానికి కాంపౌండ్ వాల్, మెట్లు, ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణానికి అదనపు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనులను ఆగస్టు 15 లోపు ప్రారంభించి, దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ​

జీలకుంట నుండి పందిల్ల వీళ్ళే రోడ్డు పనులను త్వరలోనే పూర్తిస్థాయి బీటీ రోడ్డుగా మారుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత రెండున్నర ఏళ్లలో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు రూ. కోటికి పైగా నిధులు మంజూరు చేశామని, రాబోయే రోజుల్లో ప్రతి గల్లీలోనూ రోడ్డు ఉండేలా చూస్తామన్నారు. పాఠశాల స్థలం అన్యాక్రాంతం కాకుండా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ పనులను రాబోయే రెండు నెలల్లో పూర్తి చేయిస్తామన్నారు.

అలాగే పెద్దపల్లి కి వచ్చే ప్రధాన రహదారి పనులను పూర్తి చేసి, వారం రోజుల్లో నిధులు క్లియర్ చేసి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఎమ్మెల్యే విజయరమణ రావు గారు వివరించారు. జీలకుంట గ్రామంలో 2026-27 సంవత్సరానికి గాను రూ. 54 లక్షల బ్యాంక్ లింకేజీ, రూ. 80 లక్షల స్త్రీనిధి రుణాలు అందించామన్నారు.

అలాగే 2023-24 కాలానికి సంబంధించి 1,579 మహిళా సంఘాలకు రూ. 227.42 లక్షల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గ్రామంలో కొత్తగా 313 మందికి రేషన్ కార్డులు, లబ్ధిదారుల డివిజన్ పూర్తి చేశామన్నారు. కస్తూరిబా పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సంక్షేమ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు గొప్ప స్థాయిలో నిలవాలని కోరుకున్నారు.

గతంలో సాగునీటి కోసం రైతులు అల్లాడి పోయేవారని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాల్వల ద్వారా నిరంతరాయంగా నీరు అందించడం వల్ల ఈసారి ప్రతి రైతుకు ఎకరాకు 35 నుండి 45 క్వింటాళ్ల వరకు మక్కజొన్న, వరి పంటల దిగుబడి రావడం సంతోషకరమన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పించిందే తప్ప ఇళ్లు కట్టించలేదని విమర్శించారు.

ఇల్లు లేని ప్రతి అర్హునికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. ఈ పథకం కింద ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని పారదర్శకంగా నాలుగు దశల్లో అందిస్తామని బేస్‌మెంట్‌ దశకు: రూ. 1 లక్ష, ​లింటెల్ లెవెల్‌కు: రూ. 1 లక్ష, ​స్లాబ్ లెవెల్‌కు: రూ. 2 లక్షలు, ​ఇల్లు పూర్తిగా పూర్తయితే: రూ. 1 లక్ష (మొత్తం రూ. 5 లక్షలు) నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

​ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు మరియు అధికారులు, వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story