Dubbapalli: దుబ్బపల్లిలో రూ. 20 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు!

Dubbapalli: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లిలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 10 May 2026 9:35 PM IST
Dubbapalli
X

Dubbapalli: దుబ్బపల్లిలో రూ. 20 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు!

సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి గ్రామంలో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించబోయే గ్రామ పంచాయతీ భవనానికి స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన మరియు భూమి పూజ చేసిన గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సంవృద్ధిగా అందుతున్నాయని ప్రతీ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు అహర్నిశలు పని చేస్తున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వాటన్నిటికీ ప్రజలందరూ సహకరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ మరియు అనేక రకాల పథకాలను ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధే దీయంగా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దుబ్బపల్లి గ్రామ సర్పంచి, గ్రామ పంచాయతీ పాలకవర్గం, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story