Peddapalli: ఓదెల మల్లన్న సన్నిధిలో ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రత్యేక పూజలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు. స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ విజయ రమణారావు.

KONDAL, SULTANABAD
Published on: 13 July 2026 7:03 AM IST
Peddapalli
X

Peddapalli: ఓదెల మల్లన్న సన్నిధిలో ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రత్యేక పూజలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఒగ్గు పూజారులు రంగురంగుల కలర్లతో అత్యంత మనోహరంగా తీర్చిదిద్దిన పెద్దపట్నం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

పెద్దపట్నం స్వామివారిని పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.శ్రీ మల్లికార్జున స్వామివారి పెద్దపట్నం మహోత్సవంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని పెద్ద పట్నం వద్ద ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య ప్రభుత్వం విప్ ను శాలువాతో సన్మానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యనిర్వహణాధికారి సదయ్య ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుల్తానాబాద్ రంజిత్ రావు పోత్కపల్లి ఎస్సై సనత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story