Peddapalli: ఓదెల మల్లన్న ఆలయానికి మహర్దశ.. 45 రోజుల్లో కొత్త హంగులు!

Peddapalli: పెద్దపెల్లి జిల్లా ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు శ్రీకారం చుట్టారు.

KONDAL, SULTANABAD
Published on: 13 May 2026 11:44 AM IST
Peddapalli
X

Peddapalli: ఓదెల మల్లన్న ఆలయానికి మహర్దశ.. 45 రోజుల్లో కొత్త హంగులు!

పెద్దపల్లి: ఓదెల మల్లన్న ఆలయాన్ని అన్ని హాంగూలతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు.పెద్దపెల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆలయం చుట్టూ ప్రధాన రహదారి నిర్మాణానికి కోటి రూపాయల నిధులతో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. ముందుగా ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రభుత్వ విప్ కు ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈవో సదయ్య పుష్పగుచ్చతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.

అనంతరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయ రమణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో దశలవారీగా ఓదెల మల్లన్న క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని విజయ రమణారావు స్పష్టం చేశారు. ఆలయం చుట్టూ రోడ్డు నిర్మాణం కోసం DMFT నిధుల నుండి కోటి రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది అన్నారు.భక్తుల సౌకర్యార్థం 15 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా టాయిలెట్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామన్నారు.

ఈ పనులను రాబోయే 30 నుండి 45 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే దేవాలయం వద్ద డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి అయ్యాయి. నూతన సాంకేతికతతో నిర్మిస్తున్న రోడ్డు కనీసం 40 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటుందని తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ఒగ్గు పూజారులకు టిక్కెట్ రేట్లు పెంచి వారికి తగిన గుర్తింపు ఇచ్చామని గుర్తు చేశారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story