Peddapalli: బందంపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన విజయరమణరావు!

Peddapalli: పెద్దపల్లి పట్టణంలోని బందంపల్లిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు.

RAJU, PEDDAPALLI
Published on: 29 Nov 2026 3:23 PM IST
Peddapalli
X

Peddapalli: బందంపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన విజయరమణరావు!

పెద్దపల్లి: పెద్దపల్లి పట్టణంలోని బందంపల్లిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నుండి రైతులు పండించిన పంటలో ఎలాంటి కటింగ్లు లేకుండా చేసి రైతన్నలకు వెన్నుదన్నుగా నిలిచామని గుర్తు చేశారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని నిర్వాహకులకు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బందంపల్లి కౌన్సిలర్, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, పట్టణ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI