Sultanabad: యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి విప్ విజయరమణ రావు భూమి పూజ

Sultanabad: సుల్తానాబాద్ మున్సిపాలిటీ 7వ వార్డులో రూ.10 లక్షలతో నిర్మించనున్న యాదవ కమ్యూనిటీ హాల్ పనులకు ప్రభుత్వ విప్ విజయరమణ రావు భూమి పూజ చేశారు.

KONDAL, SULTANABAD
Published on: 13 Nov 2026 5:08 PM IST
Sultanabad
X

Sultanabad: యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి విప్ విజయరమణ రావు భూమి పూజ

​సుల్తానాబాద్: సుల్తానాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 7వ వార్డులో రూ.10 లక్షల నిధులతో చేపడుతున్న యాదవ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు గౌరవ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి వేద మంత్రోచ్ఛారణల నడుమ శంకుస్థాపన, భూమి పూజ చేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్థానిక ప్రజల, వివిధ సామాజిక వర్గాల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించి కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రజాప్రతినిధులు, యాదవ సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD