Vemulawada: వేములవాడ దత్తాత్రేయ ఆలయంలో ఘనంగా అన్నదానం: పుల్కం రాజు

Vemulawada: వేములవాడ తెలంగాణ చౌక్‌లోని దత్తాత్రేయ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పాల్గొని ప్రసాద వితరణ చేశారు.

BABU, VEMULAWADA
Published on: 26 Oct 2026 3:59 PM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడ దత్తాత్రేయ ఆలయంలో ఘనంగా అన్నదానం: పుల్కం రాజు

​వేములవాడ: వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద కొలువై ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో సోమవారం పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని, భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు.

​ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ... ప్రతి పౌర్ణమికి నియమనిష్ఠలతో దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్న నిర్వాహకుల సేవాభావాన్ని విశేషంగా ప్రశంసించారు.

"అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు" అనే ఆధ్యాత్మిక సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని, నిర్వాహకులు ప్రతి నెలా భక్తులకు ఆకలి తీర్చడాన్ని దైవసేవగా భావించడం సంతోషదాయకమన్నారు భక్తి భావనతో పాటు తోటివారికి సహాయపడే పరోపకార గుణాన్ని చాటిచెప్పే ఇటువంటి సత్కార్యాలు భక్తుల మనస్సులలో అమితమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపుతాయని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా దైవకార్యాలలో, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస్, కొక్కుల బాలకృష్ణ, కుమ్మరి శంకర్లతో పాటు నాయకులు పులి రాంబాబు,రేగుల మల్లికార్జున్, సంటి మహేష్,ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు మరియు విశేష సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA