Karimnagar: కరీంనగర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!
Karimnagar: కరీంనగర్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
Karimnagar: కరీంనగర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!
Karimnagar: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు.
నగరంలోని పలు కాలనీలలో మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు బతుకమ్మలు ఆడి సందడి చేశారు.
నగరవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనగా, మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
మహాశక్తి ఆలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
తెలంగాణ సాంగ్ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ సందర్భంగా నగరంలోని మహాశక్తి ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. బండి సంజయ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. మహిళలకు ఎంతో ఇష్టమైన ఈ బతుకమ్మ పండుగ అందరూ ఒకచోట చేరి ఆనందం ఉత్సవాల మధ్య ఘనంగా నిర్వహించుకుంటున్నారు.




