Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు!
Karimnagar: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో వైభవంగా సాగిన బతుకమ్మ వేడుకలు. వైస్ ఛాన్సలర్ ఆచార్య ఉమేష్ కుమార్, మహిళా అధ్యాపకులు, విద్యార్థినుల సందడి.
Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు!
Karimnagar: శాతవాహన విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఉమెన్స్ సెల్ ఆధ్వర్యంలో'ఫస్ట్ సర్కిల్' వద్ద తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా విశ్వవిద్యాలయ ప్రాంగణమంతా రంగురంగుల పూల గుబాళింపులు, సాంప్రదాయ పాటలు, ఆటలతో కోలాహలంగా మారింది.
ఈ వేడుకల్లో శాతవాహన వైస్ ఛాన్సలర్ యు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ "బతుకమ్మ బాట-మన సంస్కృతి" అనే నినాదంతో ప్రకృతిని, పూలను ఆరాధించే తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ పండుగ అని కొనియాడారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూనే మన విశిష్ట సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయంలో సాంస్కృతిక సామరస్యం, ఐక్యత పెంపొందేలా ఇలాంటి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్, ఓఎస్డీ డాక్టర్ హరికాంత్, ఆర్ట్స్ అండ్ లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మావతి, ప్రొఫెసర్ సుజాత, ఉమెన్స్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ నమ్రత, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, హాస్టల్ వార్డెన్లు, మహిళా అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మలు పేర్చి, చప్పట్లతో ఆటపాటలు నిర్వహించారు.
అనంతరం అత్యంత సుందరంగా అమర్చిన బతుకమ్మలను ప్రదర్శించి, సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




