Ramadugu: వెధిరలో భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ.. పోచమ్మ తల్లికి ఘనంగా నైవేద్యాలు!
Ramadugu: రామడుగు మండలం వెధిర గ్రామంలో ఘనంగా జరిగిన పోచమ్మ తల్లి బోనాల పండుగ.
Ramadugu: వెధిరలో భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ.. పోచమ్మ తల్లికి ఘనంగా నైవేద్యాలు!
కరీంనగర్ జిల్లా: రామడుగు మండలం వెధిర గ్రామంలో శ్రీ వినాయక రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ తల్లి దేవత బోనాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం నుంచే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మహిళలు తలపై బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి గ్రామ ప్రజల సుఖశాంతులు, పాడి పంటల సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు పోచమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.




