Bommakal: బొమ్మకల్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకలు!

Bommakal: కరీంనగర్ బొమ్మకల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 17 Oct 2026 7:53 AM IST
Bommakal
X

Bommakal: బొమ్మకల్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకలు!

Bommakal: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని బొమ్మకల్‌లో ఏడు రోజుల సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా ముగిసాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు బొమ్మకల్ ప్రాంతంలో పండగ వాతావరణాన్ని తలపించాయి. ఈ వేడుకల్లో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

స్థానిక మహిళలు పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను ఉంచి, చుట్టూ చేరి భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలిచారు. ముఖ్య అతిథులుగా హాజరైన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మహిళలతో కలిసి ఉత్సాహంగా ఉయ్యాల పాటలకు బతుకమ్మ ఆడుతూ... సందడి చేశారు.

అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావులను స్థానిక ప్రజలు ఘనంగా శాలువాలతో సత్కరించారు. అనంతరం బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో గంగమ్మ ఓడికి చేర్చారు. ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఏడు రోజుల సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మేయర్, డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, మహిళలు, యువతి యువకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR