Jammikunta: స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ భారీగా తరలివచ్చిన భక్తులు

Jammikunta:కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ కొత్తపల్లిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి.

GANESH, JAMMIKUNTA
Published on: 12 May 2026 10:25 AM IST
Jammikunta
X

Jammikunta: స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ భారీగా తరలివచ్చిన భక్తులు

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రోజున హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆలయ ప్రధాన అర్చకులు వేముగంటి భార్గవ శర్మ అర్చకులు చందర్రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఉదయం శ్రీ గణపతి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి శ్రీ భక్తాంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి, విశిష్ట అలంకరణ చేసి భక్తులకు శ్రీ భక్తాంజనేయ స్వామి దివ్య దర్శనం కల్పించారు.

హనుమాన్ జయంతి సందర్భంగా సాయి బాలాజీ సూపర్ మార్కెట్ వారు దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించారు గర్రెపల్లి లక్ష్మీనారాయణ జ్యోతి దంపతులు పులిహోర ప్రసాదాన్ని మరియు జమ్మికుంట వాసవి క్లబ్ సభ్యులు ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ అరటిపండ్లు పులిహోర పంపిణీ చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story