Sircilla: మానేరు వాగు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్!

Sircilla: సిరిసిల్ల మానేరు వాగు వద్ద జరుగుతున్న వినాయక నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

KALEEM, SIRICILLA
Published on: 25 Sept 2026 9:50 PM IST
Sircilla
X

Sircilla: మానేరు వాగు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్!

సిరిసిల్ల: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగుతున్న గణేష్ శోభాయాత్రతో సిరిసిల్లలో పండుగ వాతావరణం నెలకొంది.

సిరిసిల్ల మానేరు వాగు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్.. నిమజ్జన ప్రదేశంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు.

నిమజ్జన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. విద్యార్థుల నృత్యాలు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు, మ్యూజిక్ షో, మ్యాజిక్ షో కార్యక్రమాలు అలరించాయి. పిల్లలు, పెద్దలు ఆసక్తిగా సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీధర్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, తహసీల్దార్ మహేష్‌తో పాటు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA