Sultanabad: పూసాలలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహణ

Sultanabad: హనుమాన్ జయంతి సందర్భంగా పూసాలలో నిర్వహించిన శోభాయాత్రలో భారీగా భక్తులు పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో సందడి చేశారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 9 May 2026 5:09 PM IST
Sultanabad
X

Sultanabad

Sultanabad: సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని హనుమాన్ జయంతి సందర్భంగా పూసాల లో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర భక్తి, ఉత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించడం జరిగింది. శంభు లింగేశ్వర స్వామి దేవాలయ, హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు, నిర్వహించిన అనంతరం భారీ శోభాయాత్రను ప్రారంభించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి ప్రపత్తిని చాటుకున్నారు.శోభాయాత్రలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. డప్పు వాయిద్యాలు, భజనలు, కోలాటాలు, కాషాయ జెండాలతో గ్రామ వీధులన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.జై శ్రీరామ్ జై హనుమాన్” నినాదాలతో పూసాల గ్రామం మార్మోగిపోయింది. వార్డులలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రకు మహిళలు ఆంజనేయ స్వామి టెంకాయలు కొట్టి,హారతులతో స్వాగతం పలికారు. యువకులు భారీ సంఖ్యలో పాల్గొని క్రమశిక్షణతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు నిర్వాహకులు చల్లని నీరు, పానీయాలు, ప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, హనుమాన్ జయంతి వేడుకలు యువతలో భక్తి, దేశభక్తి, ధైర్యసాహసాలను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి సంవత్సరం కంటే ఈసారి మరింత వైభవంగా శోభాయాత్ర నిర్వహించామని హనుమాన్ భక్తులు పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో ముగిసిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, మహిళలు, హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story