Vemulawada: శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం!
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
Vemulawada: శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం!
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా, ఐదవ రోజు వేడుకలను ఆలయ ఈవో (EO) శ్రీమతి ఎల్. రమాదేవి గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
నవంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పవిత్ర కార్తీక మాస పర్వదినాల సందర్భంగా, ప్రతిరోజూ సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు సుహాసినుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులకు మరియు శ్రీ రాజరాజేశ్వరి సేవాసమితి సభ్యులకు ఆలయ అర్చకులు, అధికారులు పసుపు, కుంకుమ, అక్షింతలు, గాజులు, వాయనంతో పాటు శ్రీ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఈ వేడుకల్లో ఆలయ ఏఈఓ (AEO) శ్రీమతి జయకుమారి గారు, పర్యవేక్షకులు ఓన్నారం భాస్కర్ గారు, అర్చకులు.




