Sircilla: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సిరిసిల్లలో తిరంగా ర్యాలీ!

Sircilla: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీని ఘనంగా నిర్వహించారు.

KALEEM, SIRICILLA
Published on: 15 Aug 2026 8:16 AM IST
Sircilla
X

Sircilla: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సిరిసిల్లలో తిరంగా ర్యాలీ!

Sircilla: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు.

అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన ర్యాలీలో బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పట్టణంలోని పాఠశాలల ఎన్‌సీసీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల సంస్కృతులు, భాషలు వేరైనా, తిరంగా జెండా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని గోపి అన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు.

యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించినట్లు బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story