Metpally: స్కూల్, స్పోర్ట్స్ గ్రాంట్ల నిర్వహణలో హెచ్ఎంల ఇబ్బందులు!

Metpally: ప్రభుత్వ పాఠశాలల స్కూల్, స్పోర్ట్స్ గ్రాంట్ల నిర్వహణలో హెచ్ఎంలు ఇబ్బందులు పడుతున్నారని టీఎస్‌సీఎస్‌టీయూఎస్ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు యద్దనపూడి ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 24 Nov 2026 4:17 PM IST
Metpally
X

Metpally: స్కూల్, స్పోర్ట్స్ గ్రాంట్ల నిర్వహణలో హెచ్ఎంల ఇబ్బందులు!

Metpally: ప్రభుత్వ పాఠశాలలకు మంజూరయ్యే స్కూల్ గ్రాంట్లు, స్పోర్ట్స్ గ్రాంట్లు వంటి వివిధ రకాల నిధుల నిర్వహణలో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం (TSCSTUS) జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు యద్దనపూడి ఆనంద్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో పాఠశాల అవసరాలైన రికార్డులు, రిజిస్టర్లు, విద్యార్థుల క్రీడా సామాగ్రి మరియు ఇతర అవసరాల కోసం ప్రభుత్వం నేరుగా పాఠశాల ఖాతాలో నిధులు జమ చేసేదని, తద్వారా నేరుగా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉండేదని ఆయన గుర్తు చేశారు.

అయితే, ప్రస్తుతం అమలు చేస్తున్న 'విధానాల వల్ల నిధులు ఖాతాలో పడకముందే సంబంధిత దుకాణదారుల నుండి జీఎస్టీ (GST) బిల్లులు, వివిధ రకాలైన రసీదులు, వారి ఖాతా జిరాక్స్ లు సామాగ్రి కొనుగోలు చేయకుండానే ఈ పత్రాలన్నీ వ్యాపారులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని దీని తో హెచ్ఎంలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

ఒకవేళ ఈ పత్రాలను సేకరించినప్పటికీ, వివిధ రకాల సర్టిఫికెట్స్ సమర్పిస్తేనే దుకాణదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని, ఆ తర్వాతే సామాగ్రిని కొనుగోలు చేయాల్సిన సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలను సడలించి, గ్రాంట్ల నిర్వహణ సులభతరం అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA