Ganneruvaram: గన్నేరువరంలో గాలి వాన బీభత్సం.. ఎగిరిపోయిన ఇంటిపై కప్పులు
Ganneruvaram: గన్నేరువరం మండలంలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడటంతో నిలిచిపోయిన రాకపోకలు.
Ganneruvaram: గన్నేరువరంలో గాలి వాన బీభత్సం.. ఎగిరిపోయిన ఇంటిపై కప్పులు
Ganneruvaram: గన్నేరువరం మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో పాటు తీవ్రమైన గాలులు బీభత్సం సృష్టించాయి. గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి గ్రామాలలో ఇంటి పైకప్పు రేకులు గాలి వేగానికి కొట్టుకొని పోయాయి. పీచుపల్లి, జంగాపల్లి లో రోడ్డుకు అడ్డంగా చెట్లు విరిగిపడడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గునుకుల కొండాపూర్ లో విద్యుత్ స్తంభాలు నెలకొరగడంతో కరెంటు లేక గ్రామస్తులు సతమతం అవుతున్నారు. వెంటనే కరెంటును పునరుద్ధరించాలని అధికారులను కోరుతున్నారు. మంగళవారం రాత్రి చివరి బస్సు రాకపోకలు బంద్ కావడంతో గునుకుల కొండాపూర్ లో నిలిచిపోవడంతో ప్రయాణికులు తెల్లవారులు బస్సులోనే ఉండి నానా అవస్థలు పడ్డారు. రోడ్లమీద ఉన్న చెట్లను తొలగించే రవాణాలను పునరుద్ధరించే విధంగా అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




