Karimnagar: పోలీసులకు సవాల్‌గా మారిన బంద్.. కరీంనగర్‌లో ఉత్కంఠ!
Karimnagar: కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బిఆర్ఎస్ బంద్ పిలుపు.
Karimnagar: పోలీసులకు సవాల్‌గా మారిన బంద్.. కరీంనగర్‌లో ఉత్కంఠ!
కరీంనగర్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడిని నిరసిస్తూ బి ఆర్ ఎస్ బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు. కరీంనగర్ లోని సంస్థలు స్కూల్లో కళాశాలలో స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని టిఆర్ఎస్ శ్రేణులు పిలుపునివ్వగా, బిజెపి శ్రేణులు బందుకు సహకరించవద్దని మీకు అండగా మేము ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగానే పోలీసులు ఎంపీ కార్యాలయం ముందు ఎమ్మెల్యే కార్యాలయం ముందు వాణిజ్య సంస్థల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
పోలీసులకు సవాల్ గా మారిన బంధు..
మొన్న జరిగిన దాడి సమయంలో ప్రేక్షక పాత్ర వహించాలని బిజెపి కార్యకర్తలకు అనుకూలంగా ఉండి దాడులను ఆపలేదని కరీంనగర్ టిఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు తక్కువ మంది ఉండడంతో అడ్డుకునే ప్రయత్నం చేసిన విఫలమైందని పోలీసు వర్గాలు తెలిపాయి.
బంద్కు సహకరించాలని ఒక వర్గం, అందుకు సహకరించద్దని ఒక వర్గం ప్రచారాలు చేయడంతో ఏం జరుగుతుందో అని భయాందోళనలో ఉన్న వ్యాపార వాణిజ్య సంస్థలు. పోలీసులు కూడా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేసి గొడవలు లేకుండా చూడాలని సంకల్పంతో పనిచేస్తున్నారు.




