Boinpally: వెంకటరావుపల్లిలో ప్రకృతి ప్రకోపం.. గాలివానకు కూలిన ఇళ్లు!

Boinpally: రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటరావుపల్లిలో గాలివాన బీభత్సం. పలువురి ఇళ్లు ధ్వంసం కావడంతో నిరాశ్రయులైన బాధితులు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 8 Jun 2026 10:04 AM IST
Boinpally
X

Boinpally: వెంకటరావుపల్లిలో ప్రకృతి ప్రకోపం.. గాలివానకు కూలిన ఇళ్లు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయినిపల్లి మండలంలోని వెంకటరావుపల్లి గ్రామంలో కురిసిన గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించింది. భారీ గాలులతో పాటు వర్షం కురవడంతో గ్రామంలోని పలువురు కుటుంబాల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో బాధిత కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.

గ్రామానికి చెందిన తోట శాంతమ్మకు చెందిన పెంకుటిల్లు, పైకప్పు రేకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అలాగే వెలిశాల లక్ష్మీపతికి చెందిన పెంకుటిల్లు పూర్తిగా కూలిపోయింది. పూదరి అంజయ్య ఇంటికి కూడా వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.

అదేవిధంగా నిరుపేద కుటుంబానికి చెందిన సాదక్ నిషా ఇల్లు కూడా గాలివానకు దెబ్బతింది. బాదే రాజవ్వ, బాదే దేవయ్య, మైదం కనకరాజులకు చెందిన ఇళ్లు కూడా వర్షాధారణ బీభత్సానికి పూర్తిగా ధ్వంసం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్లను కోల్పోయిన బాధితులు ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. గ్రామస్థులు కూడా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story