Siricilla: సిరిసిల్లలో భారీ వర్షం.. నీటమునిగిన ప్రధాన రహదారులు!
Siricilla: సిరిసిల్లలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు జలమయమైన ప్రధాన రహదారులు. మోకాళ్ల లోతు వరకు నిలిచిన నీటితో ఇబ్బంది పడుతున్న వాహనదారులు, స్థానికులు.
Siricilla: సిరిసిల్లలో భారీ వర్షం.. నీటమునిగిన ప్రధాన రహదారులు!
Siricilla: సిరిసిల్లలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పాత బస్టాండ్, నేతన్న చౌక్, వెంకంపేట రోడ్డు, సంజీవయ్య నగర్, ఆటోనగర్ ప్రాంతాలతో పాటు సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది.
పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీటితో పాటు డ్రైనేజీ మురుగు నీరు కూడా రోడ్లపైకి చేరడంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు.
డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే వర్షాలు కురిసిన సమయంలో రోడ్లపై నీరు నిలిచిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించడంతో పాటు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.




