కరీంనగర్‌లో రాజకీయ రణరంగం: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనాల ధ్వంసం.. హుజరాబాద్‌లో ఇరువర్గాల ఘర్షణ!

కరీంనగర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనాలపై బీజేపీ దాడి. హుజరాబాద్ క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల ఘర్షణతో ఉద్రిక్తత. రంగంలోకి దిగిన పోలీసులు.

RAJU, HUZURABAD
Published on: 7 May 2026 9:17 PM IST
కరీంనగర్‌లో రాజకీయ రణరంగం: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనాల ధ్వంసం.. హుజరాబాద్‌లో ఇరువర్గాల ఘర్షణ!
X

కరీంనగర్/హుజరాబాద్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనాలపై బిజెపి నాయకులు దాడి చేసి ధ్వంసం చేశారు.

ఈ ఘటనతో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు భద్రత కల్పించి కరీంనగర్ నుండి హుజురాబాద్ క్యాంపు కార్యాలయనీకి తరలించారు. అయితే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా హుజరాబాద్ ఏసిపి మాధవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఉన్నాడని విషయం తెలుసుకున్న బిజెపి శ్రేణులు కార్యకర్తలు బిజెపి జెండాలతో క్యాంప్ కార్యాలయం పైకి రావడంతో అక్కడ వారిని అరెస్టు చేసే క్రమంలో క్యాంపు కార్యాలయంలో ఉన్న బి ఆర్.స్ శ్రేణులు పోలీసులు ఏర్పాటు చేసిన భారీ కేడ్ల వద్దకు వద్దకు రావటంతో ఇరు పార్టీల మధ్యన ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీ కార్యకర్తలను చదరగొట్టే ప్రయత్నంలో బి ఆర్ఎస్ శ్రేణులు కర్రలతో బిజెపి శ్రేణులపై దాడి చేయగా అవి పోలీస్ సిబ్బందికి కూడా తాకాయి..ప్రస్తుతానికి ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు తో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కట్టు దీట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

RAJU, HUZURABAD

RAJU, HUZURABAD

Next Story