Karimnagar: కరీంనగర్‌లో టెన్షన్ టెన్షన్.. బంద్ సెగతో రోడ్లపైకి పోలీసులు!

Karimnagar: కరీంనగర్ లో పాక్షికంగా కొనసాగుతున్న బంద్. బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్, మూతపడ్డ షాపింగ్ మాల్స్.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 9 May 2026 12:38 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో టెన్షన్ టెన్షన్.. బంద్ సెగతో రోడ్లపైకి పోలీసులు!

కరీంనగర్: కరీంనగర్ బందు పాక్షికంగా కనిపిస్తుంది. ముందస్తుగా బందుకు పిలుపునివ్వడంతో టవర్ సర్కిల్ ప్రాంతంలో 11 వరకు దుకాణాలు తెరవలేదు. అక్కడక్కడ కొన్ని దుకాణాలు తీసిన టిఆర్ఎస్ నాయకులు వచ్చి బంద్ పాటించాలని సూచించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నగరంలోని టవర్ సర్కిల్ ప్రాంతం, గంజి, శాస్త్రి రోడ్, గాంధీ రోడ్, రాజీవ్ చౌక్, ఐ బి చౌరస్తా, గీతా భవన్, బస్టాండ్, కోర్టు సర్కిల్ ప్రాంతాల్లో షాపు యజమానులు స్వచ్ఛందంగా మూసి వేశారు. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ దుకాణాలు తెరిచి ఉంచారు. షాపింగ్ మాల్స్ పూర్తిగా మూసివేసి ఉన్నాయి.

ప్రజా ప్రయోజనాలు లేని ఈ బంధువు వల్ల వ్యాపార సంస్థలకు ప్రజలకే నష్టం వాటిల్లుతుంది. కరీంనగర్ లో శనివారం కావడం ప్రతి శనివారం అంగడి జరుగుతుంది ఈ బందు వల్ల శనివారం అంగడి పై కూడా ప్రభావం పడుతుంది. వేసవికాలం బిజినెస్లన్నీ ఉదయం వేళ సాయంత్రం వేళ జరుగుతాయి ఈరోజు ఉదయం బిజినెస్ లేకుండా పోయింది పలువురు చిరు వ్యాపారస్తులు వాపోయారు.

బంధు ప్రభావం వల్ల గ్రామాల నుండి వచ్చే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయ నాయకుల మధ్య గొడవ బందుకు దారితీసింది.

బందు నేపథ్యంలో ముందస్తు నాయకుల అరెస్ట్..

బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో టవర్ సర్కిల్ ప్రాంతంలో తిరిగి చల్లని చూస్తున్న బి.ఆర్.ఎస్ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేశారు.ముందస్తుగా కొంతమంది రాజకీయ నాయకులను అరెస్టు చేసిన ఎక్కడ కనిపించిన మిగతా నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేసి పిటిసికి తరలించారు. నగరవ్యాప్తంగా పోలీసు బలగాలను భారీగా మోహరించి ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పోలీసులు.

పరిస్థితులను సమీక్షించిన పోలీస్ కమిషనర్..

కరీంనగర్లో బందు ప్రభావంతో ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇరు వర్గాల కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు. బంద్ ప్రభావాన్ని స్వయంగా పర్యవేక్షించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్. టవర్ సర్కిల్ ప్రాంతంలో బందోబస్తు పర్యవేక్షించి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్న పోలీస్ కమిషనర్. తగిన సూచనలు చేసి ఎక్కడ అల్లర్లు జరగకుండా చూడాలని పోలీస్ అధికారులకు పోలీసులకు సూచించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story