Kalva Srirampur: కాటారం సభకు కాల్వ శ్రీరాంపూర్ నుండి జనజాతర!
Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాటారం సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.
Kalva Srirampur: కాటారం సభకు కాల్వ శ్రీరాంపూర్ నుండి జనజాతర!
Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం నుంచి కాటారం లో నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు భారీ సంఖ్యలో తరలిరారు. మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్యలు జెండా ఊపి కాటారం సభకు పెద్ద మొత్తంలో తరలి వెళ్లారు.
ఈ సందర్బంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చేసిన అవినీతి లను సందర్శించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారన్నారు.ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటోందని తెలిపారు.
ముఖ్యంగా రైతులకు రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర పురోగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిరెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, సర్పంచ్ బంగారి రమేష్, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, దేవేందర్రావు, సబ్బని రాజమల్లు తదితరులు ఉన్నారు.




