Karimnagar: నగునూరు ఆలయంలో హ్యూమనాయిడ్ రోబో 'చిచ్చా' దాండియా!

Karimnagar: నగునూరు దుర్గాభవానీ ఆలయంలో హ్యూమనాయిడ్ రోబో ‘చిచ్చా’ సందడి. దాండియా దుస్తులతో నృత్యం చేస్తూ భక్తులను అలరించిన రోబోటిక్స్ వినూత్న ప్రదర్శన.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 16 Oct 2026 8:23 AM IST
Karimnagar
X

Karimnagar: నగునూరు ఆలయంలో హ్యూమనాయిడ్ రోబో 'చిచ్చా' దాండియా!

Karimnagar: కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో డోబో రోబోటిక్స్ సంస్థకు చెందిన హ్యూమనాయిడ్ రోబో ‘చిచ్చా’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ దాండియా దుస్తులు ధరించిన ఈ రోబో, ఉత్సవాల్లో భక్తులతో కలిసి నృత్యాలు చేస్తూ ఎంతగానో అలరించింది.

ఈ సందర్భంగా రోబోటిక్ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ ఆధునిక రోబోటిక్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో మేళవించి ‘చిచ్చా’ను తీర్చిదిద్దినట్లు సంస్థ నిర్వాహకుడు తుమ్మల రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో వినాయక చవితి సందర్భంగా దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ మూషికాన్ని పరిచయం చేశామని, ఇప్పుడు నవరాత్రి వేడుకల్లో చిచ్చాతో వినూత్న ప్రదర్శన ఇస్తున్నామని చెప్పారు.

రాబోవు రోజుల్లో కూడా మరింత అభివృద్ధి పరిచిన రోబోలను తయారుచేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఎంటర్టైన్ చేసే విధంగా రోబో ప్రదర్శనలు నిర్వహిస్తామని దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు మంచి తో పాటు టెక్నాలజీని కూడా అందిస్తూ , పిల్లలకు, పెద్దలకు అన్ని అవసరాలకు ఉపయోగపడే రూపంలో తయారీ లక్ష్యంగా మా సంస్థ పనిచేస్తుందని తెలిపారు.

దాండియా ఆడుతున్న రోబోను చూసేందుకు చిన్నారులు, యువత, మహిళలు అమితాసక్తి కనబరిచారు. చిచ్చాతో ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో రోబోటిక్ సంస్థ నిర్వాహకుల తో పాటు

ఆలయ కమిటీ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు,కార్పొరేటర్ వంగల పవన్, ఇతర ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN