Sircilla: సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద దారుణం భార్యపై కత్తితో దాడి!
Sircilla: సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త. ఆస్పత్రి వద్ద హంగామా చేయడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Sircilla: సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద దారుణం భార్యపై కత్తితో దాడి!
Sircilla: సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భర్త తన భార్యపై కత్తితో దాడి చేశాడు. భార్యాభర్తలు ఇద్దరూ మద్యం సేవించిన అనంతరం గొడవ జరగడంతో ఈ దాడి చోటుచేసుకుంది.
భర్త కత్తితో భార్య చేతిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయమై భారీగా రక్తస్రావం జరిగి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆటోలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. భర్త అడ్డుకున్నాడు.
చివరకు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ కూడా భర్త హంగామా చేశాడు. ఆస్పత్రి సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడంతో పాటు.. పోలీసులను సైతం అడ్డుకున్నాడు. దీంతో ఆస్పత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.




