Jammikunta: జమ్మికుంటలో బీఎస్పీ సమీక్షా సమావేశం: ఎన్నికలే లక్ష్యంగా కేడర్‌కు దిశానిర్దేశం!

Jammikunta: జమ్మికుంటలోని ప్రభు ఆర్ట్స్ గ్యాలరీలో బీఎస్పీ హుజురాబాద్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమీక్షా సమావేశం జరిగింది.

GANESH, JAMMIKUNTA
Published on: 9 May 2026 7:53 PM IST
Jammikunta
X

 Jammikunta: జమ్మికుంటలో బీఎస్పీ సమీక్షా సమావేశం: ఎన్నికలే లక్ష్యంగా కేడర్‌కు దిశానిర్దేశం!

జమ్మికుంట: బహుజన సమాజ్ పార్టీ హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులచే సమీక్షా సమావేశం కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభు ఆర్ట్స్ గ్యాలరీ నందు హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు మంద సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్, పార్లమెంట్ ఇంచార్జ్ దొడ్డసమ్మయాలు ముఖ్య అతిథులుగా హాజరై రానున్న ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) గ్రామ గ్రామాన గడపగడపకు తీసుకువెళ్లే విధంగాఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు అగ్రకుల పేదలందర్నీ ఏకం చేస్తూ గెలిపి లక్ష్యంగా అసెంబ్లీ కమిటీలతో పాటు సెక్టార్ కమిటీలు, బూట్ కమిటీల నిర్మాణాలు బలోపేతం చేయాలని సూచించారు.

ఈనెల 14న కరీంనగర్ లో జరిగే ఆదిలాబాద్ జోన్ - 1 పరిధిలో జరిగే సమీక్ష సమావేశాన్ని విజయ వంతం చేయాలని జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ కోరారు. ఈ సమావేశానికి బీఎస్పీ రాష్ట్ర రథసార ఇబ్రహీం శేఖర్, నేషనల్ చీఫ్ సెక్టార్ కోఆర్డినేటర్ , మాజీ ఎమ్మెల్సీ అతార్ సింగ్ రావ్, మరో కోఆర్డినేటర్ సురేష్ ఆర్య, , రాష్ట్ర కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్, అదిలాబాద్ జోన్ -1 చీఫ్ కోఆర్డినేటర్ నిషాని రామచంద్రంలు పాల్గొననున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, జూపాక గ్రామ ఉపసర్పంచ్ గిన్నారపు మహేందర్, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జులు డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు), వేల్పుల మల్లేశం, ఎమ్మెల్యే, ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి మారపల్లి మొగిలయ్య, సీనియర్ నాయకులు ఈదునూరి రమేష్, హుజురాబాద్ అసెంబ్లీ కమిటీ నాయకులు, గరిగే చంద్రయ్య, మారముల్లా సదయ్య, రాచపల్లి రమేష్, సీనియర్ నాయకులు మామిండ్ల మల్లయ్య, బీఎస్పీ కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షులు ఉల్లెందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story