Huzurabad: దీక్ష విరమించిన హుజూరాబాద్ జేఏసీ.. ప్రణవ్ చొరవతో సక్సెస్!
Huzurabad: హుజూరాబాద్‌లో 42 రోజులుగా సాగుతున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వ్యతిరేక దీక్షలు విరమించబడ్డాయి.
Huzurabad: దీక్ష విరమించిన హుజూరాబాద్ జేఏసీ.. ప్రణవ్ చొరవతో సక్సెస్!
Huzurabad: జిల్లా మంత్రులకు,ఇంచార్జి మంత్రికి వివరించి,ఈ ప్రాజెక్ట్ హుజూరాబాద్ కు వద్దు అని స్థల మార్పిడికి కోసం పట్టుబట్టి ఆ దిశగా ప్రభుత్వ పెద్దల మనసు తట్టేలా,ఈ ప్రాజెక్ట్ గురించి వివరించిన హుజూరాబాద్ ఇంచార్జి వొడితల ప్రణవ్. హుజురాబాద్ ప్రజలకు కష్టం వస్తే తాను ముందు ఉంటా అని ప్రణవ్ వెల్లడి.
ప్రభుత్వ సానుకూలంగా ఉండడంతో ఈ నిర్ణయమని..ప్రజలకు హాని చేసే ఏ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని మరోసారి ప్రకటన. 42 రోజులుగా జేఏసీ దీక్షలకు మద్దతు పలికిన వారికి ధన్యవాదాలు తెలిపిన నాయకులు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలేదని.హుజురాబాద్ బిడ్డగా ఈ ప్రాంతానికి పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం సేవ చేస్తానని ప్రణవ్ వెల్లడి.
దీక్ష మొదలైన రెండో రోజుకే ప్రణవ్ బాబు సంఘీభావం తెలిపింది గుర్తు చేసుకున్న నాయకులు.చెప్పిన మాట ప్రకారం హుజురాబాద్ ఇమేజ్ కాపాడుతూనే,భవిష్యత్ లో మరింత సుందరీకరణగా మారుస్తా. ప్రభుత్వం,ప్రజలకు మధ్య వారధిగా తాను ప్రజల కష్టాల్లో తోడుంటాననీ తెలిపారు.ఈ ప్రకటనతో సంతోషాన్ని వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు.




