Veenavanka: లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సీఎమ్‌ఆర్‌ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

Veenavanka: కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎమ్‌ఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

GANESH, JAMMIKUNTA
Published on: 1 July 2026 5:10 PM IST
Veenavanka
X

Veenavanka: లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సీఎమ్‌ఆర్‌ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

వీణవంక: హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజాసేవలో ముందుంటున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు,

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని లబ్ధిదారుల ఇండ్లకు స్వయంగా CMRF చెక్కులను పంపిణీ చేశారు.అనారోగ్యం, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు CMRF ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఇంటి వద్దకే అందజేస్తూ, బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ధైర్యం చెప్పారు. ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు.

ప్రజల అవసరాలకు వెంటనే స్పందిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నేరుగా ప్రజల గడపకు చేర్చడంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు వీరి వెంట టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story