Jammikunta: పేదలకు సీఎంఆర్‌ఎఫ్ కొండంత అండ: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రూ.2 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేదలకు సీఎంఆర్‌ఎఫ్ భరోసా.

GANESH, JAMMIKUNTA
Published on: 29 Sept 2026 6:36 PM IST
Jammikunta
X

Jammikunta: పేదలకు సీఎంఆర్‌ఎఫ్ కొండంత అండ: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు CMRF చెక్కులతో భరోసానిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.

మడిపల్లి, మాచనపల్లి, సైదాబాద్, కోరపల్లి, విలాసాగర్, తనుగుల, వావిలాల, గండ్రపల్లి గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ.2 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యం వస్తే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని, అలాంటి కుటుంబాలకు CMRF ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఖరీదైన వైద్య చికిత్సల కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ సహాయం కొంత ఆర్థిక ఉపశమనం కల్పిస్తుందని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యం,అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే, పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

CMRF చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైద్య చికిత్సకు ఖర్చు చేసిన సమయంలో తమకు అందిన ఈ ఆర్థిక సహాయం ఎంతో అండగా నిలుస్తుందని, తమ కుటుంబంపై ఉన్న ఆర్థిక భారాన్ని కొంత మేర తగ్గించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA