Huzurabad: హుజురాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అభినందన సభ!

Huzurabad: కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో రిటైర్డ్ ఉద్యోగుల అభినందన సభ. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి. హామీలు నెరవేర్చాలని హెచ్చరిక.

RAJU, HUZURABAD
Published on: 2 Nov 2026 2:27 PM IST
Huzurabad
X

Huzurabad: హుజురాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అభినందన సభ!

Huzurabad: రాష్ట్ర ప్రభుత్వరిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్రప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన హుజురాబాద్ పట్టణానికి. చెందిన రిటైడ్ ఉపాధ్యాయుడు ఎండి ఉస్మాన్ బాషా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా హుజరాబాద్ పట్టణంలోని సిటీ ప్యాలెస్ లో సోమవారం నాడు అభినందన సభ నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అలాగే హెల్త్ కార్డులు కూడా ఇచ్చినప్పటికీ అవి కొన్ని ఆసుపత్రిలో మాత్రమే పనిచేస్తున్నాయని రాష్ట్ర అధ్యక్షుడు పెరి వెంకట్ రెడ్డి తెలిపారు.

అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే పి ఆర్ సి ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదని అన్నారు. ఈ సమస్యల అన్నిటిపై ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేనియెడల ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరు వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి ఉస్మాన్ భాష జిల్లా ప్రధాన కార్యదర్శి జాలి మహేందర్ రెడ్డి గంజి జవర్ధన్ పాల్గొన్నారు.

RAJU, HUZURABAD

RAJU, HUZURABAD