Jammikunta: సలీం పాషా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ భరోసా!
Jammikunta: జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సలీం పాషా కుటుంబానికి హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేశారు.
Jammikunta: సలీం పాషా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ భరోసా!
Jammikunta: కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తన కుటుంబంగా భావించి, కార్యకర్తలకు ఆపద వస్తే ముందుండి ఆ కుటుంబానికి పెద్ద దిక్కులాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ నిలబడ్డారని జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన మహమ్మద్ సలీం పాషా కుటుంబానికి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రణవ్ జమ్మికుంట కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ద్వారా అందజేశారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనుకాగా వారిని నాయకులు ఓదార్చారు. అనంతరం వారు మాట్లాడుతూ మాలో ఒకడిగా ఉన్న సలీం పాషా మరణం బాధాకరమని, కార్యకర్తలకు భరోసాను ఇస్తూ హుజూరాబాద్ ఇంచార్జి ప్రణవ్ బాబు కుటుంబానికి అండగా నిలబడడం ద్వారా కష్ట సమయంలో కుటుంబానికి అండగా మానవతావాదిగా ఉంటారని తెలియజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




