Sircilla: సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన: ముమ్మర ఏర్పాట్లు!
Sircilla: సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన మీడియా ఏర్పాట్లను సమీక్షించిన ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్.. ప్రెస్ పాస్‌లు, సభా ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు.
Sircilla: సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన: ముమ్మర ఏర్పాట్లు!
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్ సోమవారం రాత్రి సిరిసిల్లకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఐ అండ్ పీఆర్ శాఖ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ వద్ద శాఖాపరంగా చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. మీడియా సిబ్బందికి పాస్‌ల జారీ, పబ్లిక్ మీటింగ్ స్టేజ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జగిత్యాల పౌర సంబంధాల శాఖ అధికారి శ్రీధర్, కరీంనగర్ డీఐఈ కొండయ్య, ఏపీఆర్వో రవి, టైపిస్టు కవిత తదితరులు పాల్గొన్నారు.




