Sircilla: ఇల్లంతకుంట ఏఎంసీ చైర్మన్ వినయ్ కుమార్‌కు ఘన సన్మానం
Sircilla: ఇల్లంతకుంట ఏఎంసీ నూతన చైర్మన్ అంతగిరి సాహిత్య వినయ్ కుమార్‌ను అంబేద్కర్ సంఘం, భీమ్ యువసేన నాయకులు ఘనంగా సన్మానించారు.
Sircilla: ఇల్లంతకుంట ఏఎంసీ చైర్మన్ వినయ్ కుమార్‌కు ఘన సన్మానం
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా నియమితులైన అంతగిరి సాహిత్య వినయ్ కుమార్‌కు అంబేద్కర్ సంఘం నాయకులు, భీమ్ యువసేన యూత్ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు.
నేడు ఇల్లంతకుంట మండలంలోని అంబేద్కర్ సంఘ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతనంగా నియమితులైన ఏఎంసీ చైర్మన్ అంతగిరి సాహిత్య వినయ్ కుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు కాసుపాక దుర్గయ్య, కొమురయ్య, అంతగిరి సురేష్, రాములు, శంకర్, రాజయ్య, బాబు రాజయ్య, బాలయ్య, మైసయ్య, శంకర్‌తో పాటు భీమ్ యువసేన సభ్యులు కాసుపాక కిషన్, నవీన్, బాబు, కత్తేరపాక అనిల్, చందు, ప్రవీణ్, రమేష్, మనోజ్, మధు, బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.




