Illanthakunta: ఇల్లంతకుంటలో ఏఎంసీ చైర్మన్, కాంగ్రెస్ నేతలకు ఘన సన్మానం

Illanthakunta: ఇల్లంతకుంట జామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో నూతన ఏఎంసీ చైర్మన్ అంతగిరి వినయ్ కుమార్, కాంగ్రెస్ మైనార్టీ నాయకులకు ఘనంగా సన్మానం.

KALEEM, SIRICILLA
Published on: 6 Nov 2026 10:25 PM IST
Illanthakunta
X

Illanthakunta: ఇల్లంతకుంటలో ఏఎంసీ చైర్మన్, కాంగ్రెస్ నేతలకు ఘన సన్మానం

ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతగిరి సాహిత్య వినయ్ కుమార్‌తో పాటు కాంగ్రెస్ మండల మైనార్టీ అధ్యక్షుడు జమాల్, పట్టణ అధ్యక్షుడు ఫహీమ్‌లను ఘనంగా సన్మానించారు.

జామా మసీదు కమిటీ సదర్ నయీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్ రాజా, అజీమ్, తాజ్, ఆరిఫ్, ఇబ్రహీం, అశ్వాఖ్ నవాబ్, మహమ్మద్ అశ్వక్, బాబు, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA