Sircilla: ఇల్లంతకుంటలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ రికవరీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా కేవలం 48 గంటల్లోనే గుర్తించి బాధితుడికి పోలీసులు అందజేశారు.
Sircilla: ఇల్లంతకుంటలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ రికవరీ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన సూర శ్రీనివాస్ వారం రోజుల క్రితం పొలం వద్ద నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా తన రియల్‌మీ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. మొబైల్ ఫోన్ కోసం కొన్ని రోజుల పాటు వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో రెండు రోజుల క్రితం ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు స్వీకరించిన ఇల్లంతకుంట ఎస్ఐ ఉపేంద్ర చారి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్‌ను గుర్తించారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లోనే పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి స్వాధీనం చేసుకుని సూర శ్రీనివాస్‌కు అప్పగించారు.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను త్వరితగతిన గుర్తించి తిరిగి అప్పగించిన ఇల్లంతకుంట ఎస్ఐ ఉపేంద్ర చారి, పోలీస్ స్టేషన్ సిబ్బందిని బాధితుడు అభినందించాడు.




