Illanthakunta: 43 ఏళ్ల తర్వాత ఒక్కటైన చిన్ననాటి మిత్రులు.. ఇల్లందకుంట పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం!
Illanthakunta: ఇల్లందకుంట జడ్పీహెచ్ఎస్ పాఠశాల 1982-83 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 43 ఏళ్ల తర్వాత జమ్మికుంటలో కలుసుకున్నారు.
Illanthakunta: 43 ఏళ్ల తర్వాత ఒక్కటైన చిన్ననాటి మిత్రులు.. ఇల్లందకుంట పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1982 -83 విద్యా సంవత్సరంలో టెన్త్ క్లాస్ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనము జమ్మికుంట పట్టణంలోని బి.వి.ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. 43 సంవత్సరాల తర్వాత.చిన్నప్పుడు.చదువుకున్నటువంటి చిన్ననాటి మిత్రులు కలుసుకోవడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పాఠశాల రోజుల్లో తరగతి గదుల్లో చేసిన చిలిపి చేష్టలు, పాఠశాల ఆవరణంలో ఆడి పాడిన రోజులను గుర్తుకు చేసుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులను దేవేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గోగుల సత్యనారాయణ, రావుల సారంగపాణి, గొల్లపల్లి రవీందర్, కూరపాటి రవీందర్ ఐలయ్య. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




