Karimnagar: వెంకటేశ్వర్లపల్లిలో ఇసుక దోపిడీ.. గ్రామస్థుల ప్రాణాలకు ముప్పు

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లిలో ఇసుక మాఫియా ఆగడాలు. రోజుకు 300కు పైగా ట్రాక్టర్ల అక్రమ రవాణాతో రోడ్లు ధ్వంసం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 6:26 PM IST
Karimnagar
X

Karimnagar: వెంకటేశ్వర్లపల్లిలో ఇసుక దోపిడీ.. గ్రామస్థుల ప్రాణాలకు ముప్పు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మండలం వెంకటేశ్వర్ల పల్లి లో గత మూడు నెలలుగా కొనసాగుతున్న ఇసుక రవాణా గ్రామ ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీస్తోందని ఆయన తెలిపారు. (పాత కొరపల్లి గ్రామపంచాయతీ) వెంకటేశ్వర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొన్నారు. చెక్‌పోస్ట్ కారణంగా ఇసుక మాఫియా కార్యకలాపాలు గ్రామంలోని అంతర్గత వీధుల వైపు మళ్లి, రోజుకు కనీసం 300కు పైగా ట్రాక్టర్లు అధిక వేగంతో రాకపోకలు సాగిస్తున్నాయని వివరించారు. దీంతో గ్రామంలోని రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి, దుమ్ము, శబ్ద కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రత్యేకంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, వృద్ధులు, మహిళలు రోడ్లపైనడవడంకూడా.ప్రమాదకరంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎప్పుడు ఏ ట్రాక్టర్ వేగంగా వస్తుందో తెలియని పరిస్థితిలో ప్రమాద భయం నెలకొంది. గతంలో చిన్నపాటి ప్రమాదాలు జరిగినప్పటికీ అధికారుల నుండి తగిన చర్యలు తీసుకోలేదని అడ్డుకున్న పోలీసులను తోసి వెళ్ళింది ఇసుక మాఫియా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని ఇసుక మాఫియా పై చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story