Sircilla: చనిపోయిన తల్లిని హత్తుకుని పడుకున్న పిల్ల కోతి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటలో హృదయాలను కదిలించే ఘటన చోటుచేసుకుంది.
Sircilla: చనిపోయిన తల్లిని హత్తుకుని పడుకున్న పిల్ల కోతి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో హృదయాలను కదిలించిన ఘటన చోటు చేసుకుంది. వాహనం ఢీకొనడంతో తల్లి కోతి మృతి చెందగా.. ఆ విషయం తెలియని చిన్న కోతి తల్లి మృతదేహాన్ని హత్తుకుని నిద్రపోవడం స్థానికులను కంటతడి పెట్టించింది.
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన ఓ వాహనం తల్లి కోతిని ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది.
అయితే తల్లి చనిపోయిందన్న విషయం తెలియని చిన్న కోతి.. తల్లి మృతదేహాన్ని వదలకుండా హత్తుకుని, ఆమె ఒడిలోనే నిద్రపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
విషయం తెలుసుకున్న స్థానికులు చిన్న కోతిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. తల్లి కోతి మృతదేహాన్ని చూసి పలువురు విచారం వ్యక్తం చేశారు.
మూగజీవాల మధ్య ఉన్న ప్రేమ, మమకారం, అనుబంధానికి ఈ ఘటన హృదయాన్ని కదిలించే ఉదాహరణగా నిలిచింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది.




