Karimnagar: వికసిత్ భారత్ దిశగా అడుగులు.. ప్రపంచశక్తిగా భారత్: ఎమ్మెల్సీ అంజిరెడ్డి!
Karimnagar: ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు.
Karimnagar: వికసిత్ భారత్ దిశగా అడుగులు.. ప్రపంచశక్తిగా భారత్: ఎమ్మెల్సీ అంజిరెడ్డి!
కరీంనగర్ : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటూ, గ్లోబల్ శక్తిగా ఎదుగుతుందని బిజెపిశాసనమండలి సభ్యులు అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బిజెపి జిల్లా శాఖ ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు.
2047 నాటికి దేశాన్ని ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తోందని తెలిపారు. ఆ దిశలోనే మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలన కొనసాగిందన్నారు. ముఖ్యంగా స్వాతంత్ర్య శతాబ్ది వేడుకల నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ప్రధాని మోదీ నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, జాతీయ భద్రత వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తున్నారని కొనియాడారు.గత పదేళ్లలో భారత్ సాధించిన ఆర్థిక పురోగతి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పారదర్శక పాలన, మౌలిక వసతుల అభివృద్ధి ఫలితంగానే దేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని తెలిపారు.దేశ భద్రత విషయంలో కేంద్రం రాజీపడే ప్రసక్తే లేకుండా మోడీ ప్రభుత్వం ముందుకు కొనసాగుతుందన్నారు. . సరిహద్దుల రక్షణ, ఉగ్రవాద నిర్మూలన, అంతర్గత భద్రత బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతోందని చెప్పారు. ప్రధానంగా దశాబ్ద దేశాన్ని పట్టిపీడించిన అనేక సమస్యలకు మోడీ సర్కార్ విముక్తి కల్పించిందన్నారు.
కీలకమైన సాహసోపేతమైన చారిత్రక బిల్లులను సాకారం చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు., స్వచ్ఛ భారత్ అభియాన్, జన్‌ధన్ యోజన, జీఎస్టీ, త్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య నిర్మాణం, మెకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ , వందే భారత్ రైళ్లు , నేషనల్ హైవే ల నిర్మాణం లాంటి నిర్ణయాలు దేశ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయన్నారు. ఈ నిర్ణయాలు దేశ పరిపాలనా వ్యవస్థలో, సామాజిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.
మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా మహిళలను స్వయం సమృద్ధి దిశగా తీసుకు వెళ్లడానికి మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అదే దిశలో చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ముందు కొనసాగితే అడ్డుపడ్డాయన్నారు. మహిళల సంక్షేమం అభివృద్ధి పట్ల, మహిళా బిల్లును అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలకు ఉన్న చిత్తశుద్ధిని మహిళలంతా గ్రహించాలని కోరారు. చెప్పారు. మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా, ఎరువుల సబ్సిడీ వంటి పథకాల ద్వారా రైతులకు మోడీ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా రైతులకు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు ఎరువుల సబ్సిడీ రూపంలో ప్రయోజనం అందుతోందని వివరించారు.
దేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ అండగా నిలిచి మద్దతు ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ చూపిస్తున్న మార్గదర్శకత్వంలో భారత్ ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిచిందని, త్వరలోనే విశ్వ గురువు స్థాయికి భారత్ చేరుకుంటుందని ఆయన ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రోగ్రాం మీడియా ఇన్చార్జి వికాస్ రావు.మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్, కార్పొరేటర్ బండ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




