Karimnagar: కరీంనగర్లో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు!
Karimnagar: కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద గురువారం ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం నివాళులర్పించి జీవిత బీమా బ్రోచర్ విడుదల చేశారు.
Karimnagar: కరీంనగర్లో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు!
కరీంనగర్: ప్రపంచం ఉక్కు మహిళగా కీర్తించిన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ లోని ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ తో పాటు పలువురు నాయకులు హాజరై, ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇందిరా గాంధీ జీవిత బీమా పథకం కరపత్రంను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ
భారతదేశ స్వాతంత్ర్యానంతరం ఈ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా నాలుగు సార్లు ప్రధానమంత్రిగా విశేష సేవలందించారు. ఇందిరా గాంధీ. జవహర్ లాల్ నెహ్రూ కి పొలిటికల్ సెక్రటరీగా, లాల్ బహదూర్ శాస్త్రి క్యాబినెట్ లో ఐ అండ్ పి ఆర్ మినిస్టర్ గా సేవలు చేసి, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి పదవి చేపట్టి, దేశ సంక్షేమం, అభివృద్ధి కోసం, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కూడు, గూడు, గుడ్డ అందించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
ఆ రోజు ఇందిరా గాంధీ చొరవ వల్లే నేడు దళితులు, బడుగు, బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో ఉన్నారని, 'గరీబీ హటావో' నినాదంతో పేదరిక నిర్మూలనకు, 20 సూత్రాల పథకంతో దేశ అభివృద్ధికి కృషి చేశారని అన్నారు.
ఇందిరా గాంధీ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు వారి జయంతి సందర్భంగా వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, టాడీ టాపర్స్ దాదాపు 5 లక్షల మందికి వారి పేరుపైన చేయూత పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
భారతదేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం చేయని విధంగా ఇందిరా గాంధీ జీవిత బీమా పేరుపైన రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి 18 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా, ఈ రాష్ట్రంలో పుడితే చాలు, ఆ కుటుంబ పెద్దకు సహజ మరణం సంభవించినా, ప్రమాదవశాత్తు మరణించినా బీమా అమలు చేస్తున్నామని, దానికి సంబంధించిన బ్రోచర్ ను ఇందిరా గాంధీ విగ్రహం సాక్షిగా ఆవిష్కరించడం జరిగిందని అన్నారు.
ఇలాంటి పథకం ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ చేయలేదని, ఇందిరా గాంధీ స్ఫూర్తితో భారతదేశంలోని 29 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నామని అన్నారు.
నాడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పామని, ఇందిరమ్మ కలల సాకారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధిలో గాని, సంక్షేమంలో గాని పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నేడు రాష్ట్రంతో పాటు దేశమంతా ఇందిరమ్మ రాజ్యం కోసం, కాంగ్రెస్ పార్టీ పాలన కోసం ఎదురుచూస్తున్నారని, ఇందిరా గాంధీ అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు , ఏం డి తాజ్, మడుపు మోహన్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్,గడ్డం విలాస్ రెడ్డి, పత్తి మధుకర్ రెడ్డి,వెన్న రాజ మల్లయ్య, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, సిరిపురం లావణ్య,బాల బద్రి శంకర్, ఇక్రమ్, పడాల అజయ్,వరాల నర్సింగం, అహమ్మద్ అలీ, వెన్నం రజిత రెడ్డి,వంగల విద్యాసాగర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ రహమాన్,మాదాసు శ్రీనివాస్, దన్నా సింగ్, సరిల్లా రతన్ రాజు, కుంభాల రాజు కుమార్, మూల జైపాల్, పొన్నం మధు, అనంతుల రమేష్, చింతల కిషన్, బొబ్బిలి విక్టర్, నిహాల్, చర్ల పద్మ, అమీర్, వీర దేవేందర్, మిరియాల శ్రీధర్ రెడ్డి, గడప శ్రీనివాస్, కర్రె పావని, వసీం, మంద మహేష్, షబానా మహమ్మద్, గాండ్ల అంజయ్య, కలిముద్దీన్,లాయక్, ఇమ్రాన్ గని, మల్లారెడ్డి, శిల్ప, పెంట శేఖర్, హస్తపురం తిరుమల, సత్రం శ్రీకాంత్, పొన్నాల రాజేష్, సింగిరెడ్డి రాంరెడ్డి, అబ్దుల్ బారి, నాగుల సతీష్, మార్కరాజు, బషీరుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, మాలోతు మహాలక్ష్మి, దండి రవీందర్, జి ఎస్ ఆనంద్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.




