Karimnagar: బూరుగుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు భూమిపూజ ఘనంగా

Karimnagar: కరీంనగర్ బూరుగుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు మంజూరుతో భూమిపూజ నిర్వహించి కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 29 April 2026 11:26 AM IST
Karimnagar
X

Karimnagar

Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలో వేముల రాజమణి–రాజేశం దంపతులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ బైరిశెట్టి సంపత్, గ్రామ శాఖ అధ్యక్షుడు దూలం శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ గడ్డం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పేదలకు సొంత ఇల్లు కలను నిజం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహాలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.

అలాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా కృషి చేస్తున్నారని తెలిపారు. పేదలకు ఇళ్లు మాత్రమే కాకుండా రేషన్ కార్డులు, పెన్షన్లు, రైతులకు సహాయం, మహిళలకు సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

వేముల రాజమణి–రాజేశం కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త ఇంట్లో సుఖసంతోషాలతో జీవించాలని నాయకులు ఆకాంక్షించారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story