పేదల సొంతింటి కల సాకారం: నర్సింహులపల్లిలో ఘనంగా ‘ఇందిరమ్మ ఇల్లు’ గృహ ప్రవేశం
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నర్సింహులపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారు కల్లెపెల్లి కనుకమ్మ నూతన గృహ ప్రవేశం.
గంగాధర (కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నర్సింహులపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారు కల్లెపెల్లి కనుకమ్మ నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రాచమల్ల రవి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారుకు అభినందనలు తెలియజేస్తూ నూతన వస్త్రాలను బహూకరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారమవుతోందన్నారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం లబ్ధిదారు కల్లెపెల్లి కనుకమ్మ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి తమ కుటుంబానికి సొంతింటి ఆనందాన్ని కలిగించిన చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.




