Pegadapalli: ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎమ్మెల్యే విజయ రమణారావు

Pegadapalli: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని పేదలకు ఇళ్లు అందిస్తామని తెలిపారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 9 May 2026 12:25 PM IST
Pegadapalli
X

Pegadapalli

Pegadapalli: కాల్వ శ్రీరాంపూర్, మే 9: పేద ప్రజల సొంతింటి కలలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సిహెచ్ విజయ రమణారావు అన్నారు. శనివారం కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో సిరిసేటి సుజాత _సతీష్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటిని నిర్మించుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు ఇల్లు లేక పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకొని ఇందిరమ్మ ఇండ్ల పేరా సొంతింటి కలలను సహకారం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే రెండో విడతలో కూడా పేద ప్రజలకు మరిన్ని ఇళ్ళను ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గోపగాని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ గౌడ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, నాయకులు పింగిలి మల్లారెడ్డి, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story